🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 06 Oct, 2026 | Page: 1

మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా పచ్చిమడ్ల వెంకటయ్య... గౌడ సంఘం ఆత్మీయ సత్కారం

రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఘనంగా సన్మానం
పుష్పగుచ్ఛాలు, శాలువాతో అభినందించిన చేర్యాల గౌడ సంఘం
చేర్యాల, హిందుస్థాన్‌ మీడియా: చేర్యాల మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా పచ్చిమడ్ల వెంకటయ్య గౌడ్‌ నియమితులైన సందర్భంగా చేర్యాల గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. చేర్యాల రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద గౌడ సంఘం నాయకులు వెంకటయ్య గౌడ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ.. మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన పచ్చిమడ్ల వెంకటయ్య గౌడ్‌ రైతులు, వ్యాపారులు, గౌడ సామాజిక వర్గం సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. కొత్త బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు పచ్చిమడ్ల సిద్ధిరాములు గౌడ్‌, ప్రస్తుత మున్సిపల్‌ కౌన్సిలర్‌ పోతుగంటి ప్రసాద్‌ గౌడ్‌, మాజీ కౌన్సిలర్‌ సతీష్‌ గౌడ్‌, గుడాల ఐలయ్య, సత్యనారాయణ, అంబాల నాగేశ్వర్‌, గుడాల శ్రీనివాస్‌, పచ్చిమడ్ల కృష్ణమూర్తి, పచ్చిమడ్ల రాములు, తాటిపాముల పరశురాములు, అంబాల రాములు, అంబాల శ్రీనివాస్‌, పారమ్మ శ్రీరాములు, ప్రారంభ బాలేష్‌, బురగోని లక్ష్మీపతి, శ్రీనివాస్‌, గుడాల రాజయ్య, పశ్చిమడ్ల పరశురాములు, బండి రాజు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home