తండ్రి జ్ఞాపకార్థం బైరాన్ పల్లిలో మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణం.!
గ్రామ ప్రజల దాహార్తి తీర్చేందుకు సొంత ఖర్చులతో ముందుకొచ్చిన దాత
రాములు సేవా స్ఫూర్తి అభినందనీయం: సర్పంచ్ బర్మ రాజమల్లయ్య
సిద్దిపేట జిల్లా, దూల్మిట్ట, అక్టోబర్ 5, హిందుస్థాన్ మీడియా: తండ్రి జ్ఞాపకార్థం గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఓ దాత ముందుకొచ్చారు. దూల్మిట్ట మండల కేంద్రంలోని బైరాన్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని 1వ వార్డు ఎస్సీ కాలనీలో మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి సోమవారం గ్రామ సర్పంచ్ బర్మ రాజమల్లయ్య భూమిపూజ నిర్వహించారు.
కీ.శే. అలగోని లింగయ్య జ్ఞాపకార్థం ఆయన పెద్ద కుమారుడు అలగోని రాములు సొంత ఖర్చులతో మినీ వాటర్ ట్యాంక్ నిర్మించేందుకు దాతగా ముందుకొచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామ ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించి, తండ్రి జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమానికి ముందుకు రావడం అభినందనీయమని రాజమల్లయ్య పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధిలో భాగస్వామిగా నిలిచిన రాములు సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గ్రామాభివృద్ధి కోసం ఎన్ఆర్ఐలు, విశ్రాంత ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర దాతలు ముందుకొచ్చి తమ వంతు సహకారం అందించాలని సర్పంచ్ కోరారు. ప్రజల అవసరాలను గుర్తించి చేపట్టే ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తెలిజూరి సిద్ధులు, పంచాయతీ కార్యదర్శి కట్కూరి రాజు, పెర్కా రమేష్, పెర్కా భూమయ్య, కనకస్వామి, ఉపేందర్, రాజ నరేందర్, కనకయ్య, రాజు, దుర్గయ్య, ప్రశాంత్‌తో పాటు గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.