🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 04 Oct, 2026 | Page: 1

కళ్యాడపు శ్రీనివాస్ కుటుంబానికి పద్మశాలి సంఘం అండ...!

బియ్యం, నిత్యావసర సరుకులు, నగదు అందజేత
కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన పద్మశాలి సంఘం నాయకులు
సిద్దిపేట జిల్లా, అక్టోబర్‌ 4, హిందుస్థాన్ మీడియా: కళ్యాడపు శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులను పద్మశాలి సంఘం నాయకులు పరామర్శించి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కుటుంబ అవసరాల కోసం బియ్యం, నిత్యావసర సరుకులు, నగదు సహాయాన్ని అందజేశారు.
జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు ఆడెపు చంద్రయ్య కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం అందజేశారు. అలాగే మాజీ అధ్యక్షుడు దూడం వెంకటేశం రూ.1,000 నగదు, నాగుల వెంకటేశం రూ.1,000 విలువైన నిత్యావసర సరుకులు అందించారు.ఈ సందర్భంగా ఆడెపు చంద్రయ్య మాట్లాడుతూ కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, అవసరమైన సమయంలో సహాయం చేసేందుకు ముందుంటామని భరోసా ఇచ్చారు. సంఘ సభ్యులు కూడా కుటుంబానికి ధైర్యం చెప్పారు.
కార్యక్రమంలో పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షుడు దూడం వెంకటేశం, మాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఆడెపు మహేష్, మాజీ కార్యదర్శి గొనె శివకుమార్, మాజీ 5వ వార్డు కౌన్సిలర్‌ ఆడెపు నరేందర్, సంఘ సభ్యులు కొక్కుల నేత్ర, చెన్నూరి అఖిల్‌, కూడిక్యాల మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home