మద్దూర్ జడ్పీహెచ్ఎస్ లో నూతన సౌచాలయ సదుపాయాలు ప్రారంభం
రూ.5 లక్షల వ్యయంతో నిర్మాణం.. దాతల సహకారంతో సౌకర్యం
విద్యార్థినుల అవసరాలను గుర్తించి ముందుకొచ్చిన దాతలు
సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 3, మద్దూరు, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో బాలికల కోసం ప్రత్యేకంగా నిర్మించిన నూతన సౌచాలయ (మరుగుదొడ్లు )సదుపాయాలను శనివారం ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన దీపా జ్యువెలర్స్ సౌజన్యంతో, మోహిత్, దినేష్, తౌటి భూమయ్య సహకారంతో సుమారు రూ.5 లక్షల వ్యయంతో ఈ సదుపాయాలను ఏర్పాటు చేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సర్వర్ మోయుద్దీన్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి దాతలు మోహిత్, దినేష్, తౌటి భూమయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం మద్దూరు గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం, మండల విద్యాధికారి వరదరాజులు చేతుల మీదుగా నూతన సౌచాలయ సదుపాయాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ.. పాఠశాలలో బాలికల సౌకర్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని నూతన సౌచాలయ సదుపాయాల నిర్మాణానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థినులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో దాతలు అందించిన సహకారం అభినందనీయమన్నారు.
మద్దూరు గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం మాట్లాడుతూ విద్యార్థుల అవసరాలను గుర్తించి పాఠశాలకు సౌకర్యాన్ని కల్పించేందుకు ముందుకొచ్చిన దాతలను అభినందించారు. విద్యార్థుల విద్యతో పాటు ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు.పాఠశాలలో బాలికలకు ప్రత్యేక సౌచాలయ సదుపాయం అందుబాటులోకి రావడంతో విద్యార్థినులకు మరింత సౌకర్యం కలగనుంది. పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు, గ్రామస్తులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో కార్యదర్శి అశోక్, మాజీ ఎంపీటీసీ నరసింహులు, సత్యనారాయణ, గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.