కుకునూరుపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
నూతన గాంధీ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ
సత్యం, అహింస సిద్ధాంతాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి: సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య
సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 2, కుకునూరుపల్లి, హిందుస్థాన్ మీడియా: కుకునూరుపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను, ఆయన పాటించిన సత్యం, అహింస సిద్ధాంతాలను నాయకులు స్మరించుకున్నారు. గాంధీజీ ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య పిలుపునిచ్చారు.
అనంతరం మండల కేంద్రంలో నూతన మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు భూమిపూజ నిర్వహించారు. గ్రామ ప్రజల సమక్షంలో కొబ్బరికాయలు కొట్టి విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నూతన విగ్రహం ఏర్పాటుతో గాంధీజీ ఆశయాలను ప్రజలకు, ముఖ్యంగా యువతకు మరింత చేరువ చేయవచ్చని నాయకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కందూరి ఐలయ్య, మాజీ ఎంపీటీసీలు ఇండ్ల కనకయ్య, భూములు గౌడ్, ఉపసర్పంచ్ దొంతి సత్యం, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పిష్క అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొద్దుటూరి శ్రీనివాస్‌గుప్తా, మాజీ సర్పంచ్ కాచం నవీన్‌కుమార్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కొంతం కర్ణాకర్, కుకునూరుపల్లి పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ కారోబార్ మేకల శ్రీధర్, గ్రామ ప్రజలు, యువకులు, వివిధ వర్గాల నాయకులు పాల్గొన్నారు.