గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం
గాంధీజీకి కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళులు
పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన నాయకులు
సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 2, మద్దూరు, హిందుస్థాన్ మీడియా: జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారెళ్ల భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మద్దూరు మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.తదుపరి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు.మహాత్మా గాంధీ చూపిన పరిశుభ్రత, సామాజిక బాధ్యత మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని నాయకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బోయిన శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు జీడికంటి సురేష్, తోడంగుల భాస్కర్, మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆరిఫ్, మద్దూరు మండల పీఏసీఎస్ డైరెక్టర్ కాటం బాలయ్య, కార్యదర్శులు జక్కిరెడ్డి తిరుపతిరెడ్డి, చిలుక రాంబాబు, ఒగ్గు రవి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు సుందరగిరి బాలకృష్ణ, మద్దూరు టౌన్ గ్రామ శాఖ అధ్యక్షుడు బూరుగు రాజుగౌడ్, నర్సాయపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ముస్యాల బాబు, లగ్నూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు పూల కనకయ్య, వార్డు సభ్యుడు ఎర్రబచ్చల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.