🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 29 Sep, 2026 | Page: 1

నాగపురి ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

అంతర్‌తరాల అనుబంధం.. వయోవృద్ధుల అనుభవాలపై విద్యార్థులకు అవగాహన
రిటైర్డ్‌ ఉద్యోగి మల్లయ్య పంతులుకు ఘన సన్మానం
సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్‌ 29, చేర్యాల, హిందుస్థాన్ మీడియా: ప్రభుత్వ, జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల మేరకు ఈ నెల 24 నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వయోవృద్ధుల సంబరాల్లో భాగంగా చేర్యాల మండలం నాగపురి ఉన్నత పాఠశాలలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
‘అంతర్‌తరాల అనుబంధం–అభ్యసనం’ అనే అంశంపై గ్రామానికి చెందిన సీనియర్‌ సిటిజన్‌, రిటైర్డ్‌ ఉద్యోగి అభినపు మల్లయ్య పంతులును పాఠశాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన తన కాలం నాటి జీవన విధానం, నాటి నుంచి నేటి వరకు సమాజంలో వచ్చిన మార్పులు, వయోవృద్ధుల అనుభవాలు, కథలు, సంప్రదాయ ఆటలను విద్యార్థులతో పంచుకున్నారు.అలాగే సంస్కారవంతమైన విద్య ప్రాముఖ్యత, గురుశిష్యుల మధ్య ఉన్న అనుబంధం, నీతి కథలు, పూర్వకాలంలో ఆడిన ఆటలు తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు. గత తరాల జీవన విధానాన్ని తెలుసుకోవడం ద్వారా విద్యార్థుల్లో పెద్దల పట్ల గౌరవం, కుటుంబ విలువలు, సామాజిక బాధ్యత పెంపొందుతాయని తెలిపారు.అనంతరం మల్లయ్య పంతులును పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎలికట్టే ఐలయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణమూర్తి, పద్మ, నిరూపమ, మనోజ్‌కుమార్‌, మాధవి, స్వర్ణకుమార్‌, రాజేశ్వరి, కనకలింగం, శ్రీధర్‌, ధనలక్ష్మి, ఉమర్‌, స్వామి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home