🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 29 Sep, 2026 | Page: 1

లక్కపల్లి లో ఫామ్‌ ఫండ్‌ పనులకు శ్రీకారం!

వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు మెరుగుపడే అవకాశం: స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రకాష్‌
సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్‌ 29, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండలం ధర్మారం గ్రామ శివారు లక్కపల్లి గ్రామంలో వీబీజీ రామ్‌జీ చట్టం కింద మంజూరైన ఫామ్‌ ఫండ్‌ నిర్మాణ పనులకు మంగళవారం భూమిపూజ నిర్వహించి శ్రీకారం చుట్టారు. స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రకాష్‌, సర్పంచ్‌ జక్కుల కనకమ్మ లింగయ్య కలిసి భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ.. వీబీజీ రామ్‌జీ చట్టం కింద గ్రామానికి ఫామ్‌ ఫండ్‌ మంజూరైనట్లు తెలిపారు. ఫామ్‌ ఫండ్‌ నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.రైతులకు వ్యవసాయ పనుల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇలాంటి పనులు దోహదపడతాయని ఆయన అన్నారు. మంజూరైన పనులను నాణ్యతతో, నిర్ణీత ప్రమాణాల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు.కార్యక్రమంలో ఎంపీడీవో సీహెచ్‌ శ్రీనివాస్‌, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఏపీవో మంజుల, బీఆర్‌ఎస్‌ మండల నాయకులు జక్కుల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home