🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 29 Sep, 2026 | Page: 1

నర్సాయపల్లి లో మష్రూమ్‌ సాగు పై అవగాహన సదస్సు

గ్రామీణ యువత, రైతులకు అదనపు ఆదాయంపై శిక్షణ
తక్కువ పెట్టుబడితో స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన
సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్‌ 29, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామంలో గ్రామీణ ప్రాంతాల్లో మష్రూమ్‌ సాగును ప్రోత్సహించి రైతులు, యువతకు స్వయం ఉపాధి, అదనపు ఆదాయ అవకాశాలు కల్పించే లక్ష్యంతో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్‌, మద్దూరు మండల అధ్యక్షుడు శనిగరం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.యూనియన్‌ బ్యాంక్‌ ఆర్థిక సహకారంతో DHAN Foundation ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణలో మష్రూమ్‌ సాగు విధానం, సాగుకు అవసరమైన పద్ధతులు, ఉత్పత్తి ద్వారా లభించే ఆదాయం, మార్కెటింగ్‌ అవకాశాలపై శిక్షణార్థులకు అవగాహన కల్పించారు. తక్కువ పెట్టుబడితో మష్రూమ్‌ సాగును చేపట్టి స్వయం ఉపాధి పొందే అవకాశాలను వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, యువత సంప్రదాయ వ్యవసాయంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించాలని నిర్వాహకులు సూచించారు. మష్రూమ్‌ సాగు ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలను వినియోగించుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ భరత్‌రెడ్డి, జిల్లా ఎల్‌డీఎం హరిబాబు, నాబార్డ్‌ డీడీఎం నిఖిల్‌రెడ్డి, యూనియన్‌ బ్యాంక్‌ ఆర్‌ఎస్‌ఈటీఐ డైరెక్టర్‌ గేము నాయక్‌, ఈడీసీ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ శిరీష, ధన్‌ ఫౌండేషన్‌ సిబ్బంది నరేష్‌, ఆర్‌ఎస్‌ఈటీఐ సిబ్బంది, ఎఫ్‌పీఓ చైర్మన్‌ రామ్‌రెడ్డి, డైరెక్టర్లు, శిక్షణార్థులు, రైతులు పాల్గొన్నారు.
అనంతరం ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే DHAN Foundation 30వ ఫౌండేషన్‌ డే వేడుకలను నిర్వహించారు.
🏠 Home