🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 27 Sep, 2026 | Page: 1

డాక్టర్ పోగొట్టుకున్న ఫోన్ ను గంటల్లోనే గుర్తించిన చేర్యాల పోలీసులు

చేర్యాల హోటల్‌ వద్ద లొకేషన్‌.. ఇంటింటా వెతికి ఫోన్‌ స్వాధీనం
బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుళ్లకు డాక్టర్‌ కృతజ్ఞతలు
సిద్దిపేట, సెప్టెంబర్‌ 27, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌ హిమజా తన Samsung S26 Ultra మొబైల్‌ ఫోన్‌ను సిద్దిపేటలో పోగొట్టుకోగా, ఫోన్‌ లొకేషన్‌ చేర్యాలలో చూపించడంతో చేర్యాల పోలీసులు వెంటనే స్పందించి ఫోన్‌ను గుర్తించి ఆమెకు అప్పగించారు.
డాక్టర్‌ హిమజా ఫోన్‌ పోయిన విషయాన్ని గుర్తించి, ఫోన్‌ లొకేషన్‌ చేర్యాల పట్టణంలోని 05 Flavors హోటల్‌ పరిసరాల్లో చూపిస్తోందని చేర్యాల ఎస్‌ఐకి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ ఆదేశాల మేరకు బ్లూకోల్ట్స్‌ సిబ్బంది కానిస్టేబుళ్లు బాలకృష్ణ, బాలయ్య వెంటనే రంగంలోకి దిగారు.
లొకేషన్‌ ఆధారంగా 5 Flavors పరిసరాల్లో గాలింపు చేపట్టిన పోలీసులు సమీపంలోని ఇళ్లను పరిశీలిస్తూ చివరకు ఓ ఇంట్లో చిన్నారి వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్‌ను గుర్తించారు. ఫోన్‌ తనదేనని నిర్ధారించుకున్న అనంతరం డాక్టర్‌ హిమజాకు మొబైల్‌ను అప్పగించారు.
ఫోన్‌ను గుర్తించడంలో వేగంగా స్పందించి, లొకేషన్‌ ఆధారంగా గాలింపు చేపట్టి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుళ్లు బాలకృష్ణ, బాలయ్యలను డాక్టర్‌ హిమజా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై స్థానికులు కూడా అభినందనలు వ్యక్తం చేశారు.
🏠 Home