పేదల హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకం!
ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 26, హిందుస్థాన్ మీడియా: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో గ్రామస్తులు, యువకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు, యువకులు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. భూస్వామ్య, జమీందారీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పేదల హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని అన్నారు.
పేద ప్రజలను సమీకరించి తమ హక్కుల కోసం పోరాడిన ఐలమ్మ తెగువ మహిళల్లోనూ చైతన్యం నింపిందని గ్రామస్తులు పేర్కొన్నారు. భూమి, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన పోరాటాన్ని నేటి తరాలు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఐలమ్మ చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.