ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంస్థాగత ప్రసవాలను పెంచాలి: డీఎంహెచ్‌ఓ డా.ఏంజెలా ఆల్ఫ్రెడ్
ఇల్లంతకుంట పీహెచ్‌సీలో వైద్య సేవలపై సమీక్ష
తల్లి–శిశు ఆరోగ్యం, టీకాల కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి
రాజన్న సిరిసిల్ల జిల్లా, సెప్టెంబర్ 25, హిందుస్థాన్ మీడియా: ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల అమలు తీరుపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, తల్లి–శిశు ఆరోగ్య సేవలు, అసాంక్రమిక వ్యాధుల నియంత్రణ తదితర జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు.
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సంస్థాగత ప్రసవాల శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు తమ పరిధిలోని గర్భిణులను ముందుగానే గుర్తించి, వారికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు.
వంద శాతం టీకాల లక్ష్యంతో పనిచేయాలి
తల్లి, శిశు ఆరోగ్య సేవలను సమర్థవంతంగా అందించడంతో పాటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని వంద శాతం లక్ష్యంతో అమలు చేయాలని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు. ప్రతి అర్హుడైన చిన్నారికి నిర్ణీత సమయంలో టీకాలు అందేలా ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మధుమేహం, రక్తపోటుపై నిరంతర పర్యవేక్షణ
మధుమేహం, రక్తపోటు తదితర అసాంక్రమిక వ్యాధులను ముందుగానే గుర్తించి, అవసరమైన వారికి నిరంతర చికిత్సతో పాటు ఫాలోఅప్ సేవలు అందించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్య సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించి, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో ప్రోగ్రామ్ అధికారులు డా. సంపత్ కుమార్, డా. రామకృష్ణ, మెడికల్ ఆఫీసర్ డా. జీవన జ్యోతి, ఆశా నోడల్ అధికారి శాంత, పీహెచ్‌ఎన్ పూల, ఎన్‌హెచ్‌ఎం డీడీఎం కార్తీక్, ఇల్లంతకుంట పీహెచ్‌సీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, ఆశా కార్యకర్తలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.