సీసీ రోడ్డు వేశారు....పైపులు మరిచారు..!
ఇళ్ల మధ్యలో వర్షపు నీరు.. డ్రైనేజీ నీటితో కాలనీవాసుల అవస్థలు
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం.. సమస్య పరిష్కరించాలని డిమాండ్
చేర్యాల, సెప్టెంబర్ 25, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని 6వ వార్డులో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు కాలనీవాసులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడినప్పుడు నీరు బయటకు వెళ్లేందుకు రోడ్డుకు అడ్డంగా పైపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, వాటిని ఏర్పాటు చేయకుండానే సీసీ రోడ్డు నిర్మాణం పూర్తిచేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
దీంతో వర్షం కురిసిన ప్రతిసారీ ఇళ్ల మధ్యలోనే నీరు నిలిచిపోతోందని చెబుతున్నారు. వర్షపు నీటికి తోడు డ్రైనేజీ నీరు, చెత్తాచెదారం కూడా చేరడంతో కాలనీ మొత్తం అపరిశుభ్రంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దుర్గంధం.. విష పురుగులతో భయం!
నీరు రోజుల తరబడి నిలిచి ఉండటంతో దుర్గంధం వెదజల్లుతోందని, దోమలు పెరిగిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా పాములు, తేళ్లు, ఇతర విషపురుగులు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
సీసీ రోడ్డు నిర్మాణ సమయంలోనే వర్షపు నీరు, డ్రైనేజీ నీరు వెళ్లేందుకు అవసరమైన పైపుల ఏర్పాటుపై అధికారులు, కాంట్రాక్టర్ దృష్టి పెట్టాల్సి ఉండేదని స్థానికులు అంటున్నారు. సరైన ప్రణాళిక లేకుండా పనులు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?
ప్రజలకు ఉపయోగపడాల్సిన అభివృద్ధి పనులు సమస్యలకు కారణం కాకూడదని, నిర్మాణ పనుల నాణ్యత, డ్రైనేజీ వ్యవస్థ వంటి అంశాలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని కాలనీవాసులు కోరుతున్నారు. పనుల్లో లోపాలు ఉంటే వాటిని గుర్తించి సరిదిద్దాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
ఇప్పటికైనా చేర్యాల మున్సిపల్ అధికారులు, పాలకులు స్పందించి నిలిచిన నీటిని తొలగించడంతో పాటు, వర్షపు నీరు, డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లేలా అవసరమైన పైపులు, కాలువల ఏర్పాట్లు చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.