AISF జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా రామగళ్ల నరేష్,జేరిపోతుల జనార్ధన్
ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
విద్యారంగ సమస్యల పరిష్కారానికి పలు తీర్మానాలు
చేర్యాల, సెప్టెంబర్ 25, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట జిల్లా ఏఐఎస్ఎఫ్ ఐదవ మహాసభలు చేర్యాలలో నిర్వహించగా, మహాసభల్లో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తెలిపారు.నూతన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా రామగళ్ల నరేష్, జేరిపోతుల జనార్ధన్ ఎన్నికయ్యారు. జిల్లా ఉపాధ్యక్షులుగా కనగండ్ల మల్లికార్జున్, బత్తుల రఘు, సహాయ కార్యదర్శులుగా వేల్పుల ప్రసన్నకుమార్, బరిగే భరత్, కోశాధికారిగా బత్తుల రంజిత్, జిల్లా గర్ల్స్ కన్వీనర్గా ఆకుల శిరీష, కో-కన్వీనర్లుగా ఉప్పరపల్లి పూజ, యశ్విత, అంబికలను ఎన్నుకున్నారు. వీరితో పాటు మరో 11 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు పుట్ట లక్ష్మణ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామగళ్ల నరేష్, జేరిపోతుల జనార్ధన్ మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, జిల్లా నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న మంద పవన్కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఏఐఎస్ఎఫ్ సంఘ నిర్మాణాన్ని మరింత విస్తరించి, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు.
విద్యారంగ సమస్యలపై పలు తీర్మానాలు
మహాసభల్లో సిద్దిపేట జిల్లాలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలను ఆమోదించినట్లు నాయకులు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టి ఫీజు నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తీర్మానించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ల్యాప్టాప్లు, స్కూటీలను అర్హులైన విద్యార్థులకు వెంటనే అందించాలని, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతి, వైద్య సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఇతర మౌలిక వసతులను మెరుగుపరచాలని తీర్మానించారు. విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేలా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే ప్రభుత్వ విద్యాసంస్థల్లో డిజిటల్ విద్యా సదుపాయాలను విస్తరించి విద్యార్థులందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించాలని తీర్మానించారు.
ఈ తీర్మానాల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి దశలవారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని నూతన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామగళ్ల నరేష్, జేరిపోతుల జనార్ధన్ తెలిపారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి జిల్లాలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని వారు కోరారు.