🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 25 Sep, 2026 | Page: 1

ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు చేర్యాల గురుకుల విద్యార్థులు

జిల్లాస్థాయి అండర్‌–14 కబడ్డీ పోటీల్లో ప్రథమ స్థానం
ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికైన నితిన్‌
చేర్యాల, సెప్టెంబర్‌ 25, హిందుస్థాన్ మీడియా: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి అండర్‌–14 క్రీడా పోటీల్లో చేర్యాల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ విద్యార్థులు కబడ్డీ విభాగంలో ప్రతిభ చాటి ప్రథమ స్థానంలో నిలిచారు.సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్టేడియంలో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో గురుకుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచారు. నితిన్‌, విశాల్‌, జోసెఫ్‌, జోషి జట్టులో పాల్గొని విజయానికి కృషి చేశారు.
విద్యార్థుల ప్రతిభతో గురుకుల జట్టు జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి సాధించగా, వారిలో నితిన్‌ ఉమ్మడి జిల్లా స్థాయి జట్టుకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ పోలోజు నరసింహచారి తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు విజేత విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు శిక్షణ అందించిన ఫిజికల్‌ డైరెక్టర్‌ సురేష్‌, పీఈటీ రేణుకలను కూడా అభినందించారు. ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లోనూ విద్యార్థులు ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
🏠 Home