🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 25 Sep, 2026 | Page: 1

మానవత్వం చాటుకున్న సిపిఐ నేత అందె అశోక్

రోడ్డుపై దొరికిన రూ.50 వేల విలువైన మొబైల్‌ ఫోన్‌ యజమానికి అప్పగింత
అందె అశోక్‌ను అభినందించిన చేర్యాల ఎస్‌ఐ అపూర్వరెడ్డి
చేర్యాల, సెప్టెంబర్‌ 25, హిందుస్థాన్ మీడియా:
చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన అందె అశోక్‌ శుక్రవారం తన పని నిమిత్తం చేర్యాలకు వస్తుండగా ఆకునూరు–చేర్యాల మార్గమధ్యలో రోడ్డుపై ఓ మొబైల్‌ ఫోన్‌ పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఫోన్‌ను తీసుకుని చేర్యాల పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.పోలీసులు ఫోన్‌ నంబర్‌ ఆధారంగా మొబైల్‌ యజమాని వివరాలను గుర్తించగా ధూల్మిట్ట మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన గద్దల స్నేహగా గుర్తించారు. అనంతరం చేర్యాల పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ గూడ అపూర్వరెడ్డి చేతుల మీదుగా రూ.50 వేల విలువైన మొబైల్‌ ఫోన్‌ను యజమాని స్నేహకు అప్పగించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ అపూర్వరెడ్డి మాట్లాడుతూ రోడ్డుపై దొరికిన విలువైన వస్తువును స్వార్థం లేకుండా పోలీసులకు అప్పగించి, యజమానికి చేరేలా చేసిన అందె అశోక్‌ నిజాయితీని, మానవత్వాన్ని అభినందించారు. అశోక్‌ చూపిన బాధ్యతాయుతమైన వైఖరి అభినందనీయమన్నారు.మొబైల్‌ ఫోన్‌ను నిజాయితీగా యజమానికి అందేలా చేసిన అందె అశోక్‌పై స్థానికులు ప్రశంసలు కురిపించారు.
🏠 Home