🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 24 Sep, 2026 | Page: 1

రాంపల్లిలో ఘనంగా సామూహిక కుంకుమార్చన

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు, భక్తులు
కొండపాక, సెప్టెంబర్‌ 24, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం రాంపల్లి గ్రామంలో ఫ్రెండ్స్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం వినాయకుడి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు సామూహికంగా కుంకుమార్చన చేపట్టి స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. భక్తి పాటలు, మంగళహారతులతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది.
గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సామూహిక కుంకుమార్చనకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో ఫ్రెండ్స్‌ యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home