🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 24 Sep, 2026 | Page: 1

నాలుగోసారి గణపతి లడ్డూ దక్కించుకున్న సుధాకర్ దంపతులు

రూ.99 వేలతో లడ్డూను దక్కించుకున్న సముద్రాల సుధాకర్‌–రజిత దంపతులు
పెద్ద అంబర్‌పేట డివిజన్‌, సెప్టెంబర్‌ 24, హిందుస్థాన్ మీడియా:
జయప్రకాశ్‌ నగర్‌ కాలనీలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల్లో పూజలు అందుకున్న గణనాథుడి లడ్డూను వేలం పాట నిర్వహించగా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ వేలం పాటలో సముద్రాల సుధాకర్‌–రజిత దంపతులు రూ.99 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. వీరు నాలుగోసారి గణేష్‌ లడ్డూను వేలం పాటలో దక్కించుకోవడం విశేషంగా నిలిచింది.అదేవిధంగా గణేష్‌ స్వామివారి కలశాన్ని ఆదిమూలం రాఘవేంద్రచారి–స్వాతి దంపతులు రూ.29 వేలకు వేలం పాటలో దక్కించుకున్నారు. స్వామివారి శేష వస్త్రాలను కుక్కల లేట్‌ శంకర్‌–సత్యమ్మ దంపతులు వేలం పాటలో దక్కించుకున్నారు.గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొనడంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. నిర్వాహకులు వేలం పాటలో పాల్గొన్న భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
🏠 Home