ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువల పై అవగాహన
మోడల్ స్కూల్లో ఘనంగా హెడ్బాయ్, హెడ్గర్ల్ ఎన్నికలు
ఓటు హక్కు వినియోగించుకున్న 6వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్ విద్యార్థులు
హెడ్బాయ్గా ఎండీ గబ్బర్.. హెడ్గర్ల్గా ఎస్.అక్షిత విజయం
మద్దూరు, సెప్టెంబర్ 23, హిందుస్థాన్ మీడియా:
మద్దూరు మండల కేంద్రంలోని PM SHRI తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో హెడ్బాయ్, హెడ్గర్ల్ ఎన్నికలను మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఈ ఎన్నికలను నిర్వహించింది.ఎన్నికల ప్రారంభ కార్యక్రమానికి జిల్లా సైన్స్ అధికారి రాజమల్లు, మద్దూరు మండల విద్యాధికారి వరదరాజు, TGMS మద్దూరు ప్రిన్సిపాల్ కోట నరేందర్రెడ్డి, ముస్త్యాల ప్రిన్సిపాల్ ఎన్.రాంబాబు, మద్దూరు కాంప్లెక్స్ హెచ్ఎం సర్వార్ తదితరులు హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు.
6వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఓటు హక్కు కల్పించగా, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల ఆధారంగా తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేశారు.
హెడ్బాయ్గా ఎండీ గబ్బర్.. హెడ్గర్ల్గా ఎస్.అక్షిత
ఓట్ల లెక్కింపు అనంతరం ఫుట్బాల్ గుర్తుపై పోటీ చేసిన ఎండీ గబ్బర్ 134 ఓట్ల మెజారిటీతో హెడ్బాయ్గా, స్టార్ గుర్తుపై పోటీ చేసిన ఎస్.అక్షిత 139 ఓట్ల మెజారిటీతో హెడ్గర్ల్గా విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన అనంతరం తోటి విద్యార్థులు విజేతలకు అభినందనలు తెలిపారు.
ఈ ఎన్నికల ద్వారా విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యత, ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య విలువలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలపై అవగాహన కల్పించినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఎన్నికైన హెడ్బాయ్, హెడ్గర్ల్ పాఠశాల క్రమశిక్షణ, విద్యా ప్రమాణాలు, సహపాఠ్య కార్యక్రమాల అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణలో సోషల్ సైన్స్ విభాగం ఉపాధ్యాయులు ఎన్.శోభారాణి, కె.నీలిమ, నయీం ఫాతిమా, తిరుపతిరెడ్డి కీలక పాత్ర పోషించారు. పోలింగ్ ప్రక్రియతో పాటు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనను సమర్థవంతంగా నిర్వహించారు.విజేతలను పాఠశాల ప్రిన్సిపాల్ కోట నరేందర్రెడ్డితో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు.