🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 22 Sep, 2026 | Page: 1

‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’తో మొక్కల పెంపకానికి ప్రోత్సాహం

తల్లి పేరుతో ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటేలా అవగాహన
సెప్టెంబర్‌ 22, 23 తేదీల్లో పాఠశాలల్లో కార్యక్రమాలు
హిందుస్థాన్ మీడియా:
విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడంతో పాటు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’ కార్యక్రమాన్ని పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 22, 23 తేదీల్లో ప్రతి పాఠశాలలో విద్యార్థులు తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటేలా కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
తల్లి పేరుతో మొక్కను నాటడం ద్వారా విద్యార్థుల్లో ప్రకృతిపై ప్రేమ, పర్యావరణ పరిరక్షణపై బాధ్యత పెంపొందుతుందని నిర్వాహకులు తెలిపారు. నాటిన మొక్కలను విద్యార్థులు స్వయంగా సంరక్షించేలా ప్రోత్సహించాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి పి. రాజమౌళి, మండల విద్యాధికారి బి. నరేందర్‌, గ్రామ సర్పంచ్‌ టి. రమేష్‌ గుప్తా, ఉపసర్పంచ్‌ జంగ సురేందర్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రాజమణి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.విద్యార్థుల చేత మొక్కలు నాటించి వాటి సంరక్షణ బాధ్యతను కూడా వారికి అప్పగించడం ద్వారా పచ్చదనం పెంపొందించడంతో పాటు భవిష్యత్‌ తరాలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.
🏠 Home