హలో వార్డు మెంబర్స్.. చలో...హైదరాబాద్..!పోస్టర్ ఆవిష్కరణ
సెప్టెంబర్ 29న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా
వార్డు సభ్యుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: అతికం రాజశేఖర్ గౌడ్, అందె బీరన్న
సిద్దిపేట, సెప్టెంబర్ 22, హిందుస్థాన్ మీడియా:
వార్డు సభ్యుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 29న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ‘హలో వార్డు మెంబర్స్.. చలో హైదరాబాద్’ పోస్టర్ను సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కేఆర్ నగర్ కాలనీలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వార్డు సభ్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది అతికం రాజశేఖర్ గౌడ్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అందె బీరన్న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని వార్డు సభ్యులకు నెలకు రూ.3 వేల గౌరవ వేతనం అందించాలని, వార్డు సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. విధుల్లో ఉన్న సమయంలో ఎవరైనా వార్డు సభ్యులు అకాల మరణం చెందితే వారి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని కోరారు.
గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలపై వార్డు సభ్యుల పేర్లను కూడా చేర్చాలని, వార్డు సభ్యుల సంక్షేమం కోసం ప్రత్యేక వార్డు సభ్యుల సంక్షేమ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. వార్డు సభ్యుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణే సంఘం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో వార్డు సభ్యులు స్థానిక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములుగా పనిచేస్తున్నప్పటికీ, తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించడం లేదని వారు పేర్కొన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు అమలులో ఉన్నాయని, తెలంగాణలోనూ వార్డు సభ్యులకు గౌరవ వేతనం అమలు చేసే దిశగా పంచాయతీరాజ్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వార్డు సభ్యులపై సర్పంచుల ఆధిపత్యం లేదా జోక్యం వంటి అంశాలపై ఫిర్యాదులు వస్తే సంబంధిత మండల, జిల్లా పంచాయతీరాజ్ అధికారులు స్పందించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. వార్డు సభ్యులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 29న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అతికం రాజశేఖర్ గౌడ్, అందె బీరన్న పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎలుక శ్రీశైలం యాదవ్, చిలువకోడూరు మండల అధ్యక్షులు గొల్లపల్లి ఆంజనేయులు, రాష్ట్ర గౌరవ సలహాదారు పాకాల లక్ష్మారెడ్డి, నాయకులు మోతే అంజయ్య తదితరులు పాల్గొన్నారు.