అక్రమంగా కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పెంచాలి: అందే బీరన్న డిమాండ్
అక్రమంగా కబ్జా చేసిన భూములపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
సిద్దిపేట, సెప్టెంబర్ 20, హిందుస్థాన్ మీడియా: ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో బోదాసు మైసయ్య అధ్యక్షతన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అందె బీరన్న మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో భూముల కబ్జాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి హరీశ్రావు గత పది సంవత్సరాలుగా లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చెందిన భూములను లాక్కొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని అందె బీరన్న ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఆయా భూములను స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట పట్టణంలో చిన్నస్థాయి నాయకులు సైతం ఎకరాలకు ఎకరాలు కబ్జా చేశారని, పేదల ప్లాట్లను గుంజుకున్నారని, ప్రభుత్వ భూములను ఆక్రమించి చుట్టూ సిమెంట్ పలకలు ఏర్పాటు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. కొందరు అపార్ట్మెంట్లు నిర్మించి వాటిని అద్దెలకు ఇస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ భూములను, పేదల భూములను అక్రమంగా ఆక్రమించిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ డిమాండ్ చేసింది. ఎర్రబెల్లిలోని ఎకరాల కొద్దీ భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని జిల్లా కమిటీ కోరింది.
ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు వడ్ల రాజు, దుబ్బాక నియోజకవర్గ నాయకుడు కనకరాజు, కొండపాక మండల కార్యదర్శి అంజయ్య, జిల్లా నాయకురాలు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.