కొండపాక గురుకులం,పీహెచ్సీలో కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీ
మధ్యాహ్న భోజనం నాణ్యత, వైద్య సేవలపై క్షేత్రస్థాయి పరిశీలన
కొండపాక, సెప్టెంబర్ 19:
కొండపాక మండలంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపూలే తెలంగాణ బీసీ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, రోగులకు అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక దృష్టి
గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అన్నం, బెండకాయ ఫ్రై, పప్పు, సాంబారు, పెరుగు, గుడ్లను పరిశీలించి ఆహార పదార్థాల నాణ్యత, రుచి, పరిశుభ్రత, వంట విధానంపై వంట సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యత బాగుందని, ఇదే విధంగా ప్రతిరోజూ నాణ్యమైన ఆహారం అందించాలని వంట సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం స్టోర్ రూమ్ను తనిఖీ చేసిన కలెక్టర్.. విద్యార్థులకు ఉపయోగించే వంట సరుకులు నాణ్యమైనవే ఉండాలని సూచించారు. సరుకుల పంపిణీని విద్యార్థుల మిస్ కమిటీ సమక్షంలో వంట సిబ్బందికి అందించాలని ఆదేశించారు.
గురుకులాల్లో వంటగది, డైనింగ్ హాల్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన కామన్ డైట్ మెనూ ప్రకారం భోజనం అందించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.
పీహెచ్సీలో వైద్య సేవల పరిశీలన
అనంతరం కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి అటెండెన్స్ రిజిస్టర్, ఓపీ రిజిస్టర్ను తనిఖీ చేశారు. మెడికల్ ఆఫీసర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు విధి నిర్వహణ సమయాలను సక్రమంగా పాటిస్తున్నారా అనే విషయంపై ఆరా తీశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించిన కలెక్టర్.. మలేరియా, డెంగ్యూ తదితర కేసుల వివరాలను ఏఎన్ఎంలు, సూపర్వైజర్ల నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని మెడికల్ ఆఫీసర్ను ఆదేశించారు. ఆసుపత్రిలో అవసరమైన మందులు, వైద్య సామగ్రి తగినంతగా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
ప్రతి వారం నిర్వహించే శానిటేషన్ డ్రైవ్లో వైద్య సిబ్బంది తప్పనిసరిగా పాల్గొని, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు పూర్తిస్థాయిలో వారికి అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి సూచించారు.