🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 17 Sep, 2026 | Page: 1

బస్సులో గుండెపోటుతో మహిళ మృతి

చేర్యాల నుంచి సిద్దిపేటకు వెళ్తుండగా ఘటన..
సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 17, హిందుస్థాన్ మీడియా: ఆసుపత్రికి వెళ్లేందుకు బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మార్గమధ్యంలో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందిన విషాద ఘటన గురువారం చోటుచేసుకుంది.
చుంచనకోట గ్రామానికి చెందిన మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్యాల నుంచి సిద్దిపేటకు బస్సులో బయలుదేరారు. బస్సు గురజకుంట వాగు స్టేజి వద్దకు చేరుకునే సమయంలో ఆమెకు అకస్మాత్తుగా గుండె పోటు వచ్చినట్లు సమాచారం. దీంతో పరిస్థితిని గమనించిన బస్సు కండక్టర్, డ్రైవర్ వెంటనే అప్రమత్తమై 108కు ఫోన్ చేసి సమాచారం అందించారు.
108 సిబ్బందిని త్వరగా కలిసేందుకు డ్రైవర్ బస్సును ముందుకు తీసుకెళ్లగా, మర్రిముచ్చాల సమీపంలో 108 సిబ్బంది బస్సు వద్దకు చేరుకున్నారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు సమాచారం.
🏠 Home