చేర్యాలలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులతో అందరూ అభివృద్ధి చెందాలి: సంఘం అధ్యక్షుడు మెరుగోజు సత్యనారాయణ
సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 17, హిందుస్థాన్ మీడియా: సృష్టికర్త, శిల్పకళా ప్రవీణుడు, విశ్వ నిర్మాత శ్రీ విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలను విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడి విగ్రహానికి సంఘ అధ్యక్షుడు మెరుగోజు సత్యనారాయణ పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి, జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మెరుగోజు సత్యనారాయణ మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుడు మానవాళికి వడ్రంగం, శిల్పకళ, యంత్ర విద్య వంటి నైపుణ్యాలను అందించిన మహాశిల్పిగా విశ్వసిస్తారని తెలిపారు. విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దేశ అభివృద్ధిలో విశ్వబ్రాహ్మణులు తమ వృత్తి నైపుణ్యాలతో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
విశ్వకర్మ జయంతి సందర్భంగా సభ్యులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సమాజంలోని వృత్తి నైపుణ్యాలను పరిరక్షించుకుంటూ, యువతకు సంప్రదాయ వృత్తుల్లో నైపుణ్యాన్ని అందించాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు.కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి రాళ్లబండి భాస్కర్, విశ్వబ్రాహ్మణ సంఘ గౌరవ అధ్యక్షుడు కాసుల రమేష్, రాళ్లబండి నాగరాజు, పోలోజు శ్రీహరి, కోశాధికారి కాసుల భాస్కర్, ఉపాధ్యక్షులు మెరుగోజు రామచంద్రం, మెరుగోజు విష్ణు, తాటికొండ శ్రీనివాస్, బి. వినోద్ కుమార్, మెరుగోజు మహేష్, కమిటీ సభ్యులు బి. భాస్కర్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.