సింప్లీ ఫ్రెష్ లో మహిళలను వేధించిన సూపర్వైజర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి:సీఐటీయూ డిమాండ్
మహిళా కార్మికుల పట్ల అసభ్య ప్రవర్తన.. ఆటవిక పాలనను తలపిస్తున్న యాజమాన్య వైఖరి
పరిశ్రమలో అంతర్గత మహిళా రక్షణ కమిటీ (ICC)ని వెంటనే ఏర్పాటు చేయాలని డిఐటియు డిమాండ్
జీవో నంబర్ 6 ప్రకారం కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి: జిల్లా నేతలు ఎల్లయ్య, గోపాలస్వామి
చేర్యాల (హిందుస్థాన్ మీడియా):
చేర్యాల మండల పరిధిలోని అర్జున్పట్ల గ్రామ శివారులో గల 'సింప్లీ ఫ్రెష్' వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా కార్మికులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్న సూపర్వైజర్ను తక్షణమే ఉద్యోగం నుండి తొలగించి, అతనిపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఐటీయూ సిద్దిపేట జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం సీఐటీయూ నాయకత్వంలో పరిశ్రమను సందర్శించిన ప్రతినిధి బృందం, కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై పరిశ్రమ యజమాన్యానికి నేరుగా వినతిపత్రం అందజేసింది.
ఒంటరిగా దొరికితే వేధింపులు.. అసభ్య దూషణలు
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కాముని గోపాలస్వామి మాట్లాడుతూ.. పరిశ్రమ మండల కేంద్రానికి దూరంగా నిర్మానుష్య ప్రాంతంలో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని సూపర్వైజర్లు, యాజమాన్యం ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నాయని మండిపడ్డారు. 18 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న గ్రీన్హౌస్ యూనిట్లలో పనివేళల్లో మహిళలు ఒంటరిగా కనిపించినప్పుడు కొందరు పురుష సూపర్వైజర్లు అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మలమూత్ర విసర్జనకు వెళ్తామని అనుమతి కోరితే.. పని మానేసి వెళ్లొద్దని, 'డైపర్లు వేసుకుని రావాలంటూ' అత్యంత హేయంగా, అమానవీయంగా దూషిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చట్టబద్ధమైన హక్కుల ఉల్లంఘన – భద్రతా లోపాలు
అంతర్గత కమిటీ గైర్హాజరు: 2013 మహిళా లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POSH Act) ప్రకారం పరిశ్రమలో తప్పనిసరిగా ఉండాల్సిన మహిళా అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC)ని ఏర్పాటు చేయలేదు.
కనీస వేతనాల నిరాకరణ: ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 6 ప్రకారం చట్టబద్ధమైన కనీస వేతనాలు అమలు చేయడం లేదు.
సౌకర్యాల ఎగవేత: కార్మికుల జీతాల నుంచి ఈఎస్ఐ, పీఎఫ్ కటింగ్లు చేస్తున్నప్పటికీ వాటికి సంబంధించిన పే-స్లిప్పులు ఇవ్వడం లేదు.
భద్రతా పరికరాల కొరత: కనీస గుర్తింపు కార్డులు, భద్రతా బూట్లు (సేఫ్టీ షూస్), జాతీయ పండుగ సెలవులు సైతం ఇవ్వడం లేదు.
అక్రమ తొలగింపులు: కాంట్రాక్టు సూపర్వైజర్లు ముఖప్రీతి చూసుకుంటూ నచ్చిన వారికి పనులు కల్పిస్తూ, ప్రశ్నించిన వారిని చట్టవిరుద్ధంగా తొలగిస్తున్నారని విమర్శించారు.
సూపర్వైజర్ను తొలగిస్తాం: యజమాన్యం హామీ
కార్మిక సంఘాల ఆందోళన నేపథ్యంలో పరిశ్రమ అడ్మిన్ విభాగం ప్రతినిధి అర్జున్ స్పందిస్తూ.. మహిళలపై వేధింపులకు పాల్పడిన సదరు సూపర్వైజర్ను విధుల్లోంచి తక్షణమే తొలగిస్తామని హామీ ఇచ్చారు. కార్మికులు లేవనెత్తిన వేతనాలు, చట్టపరమైన సమస్యలను ఉన్నత యాజమాన్యంతో చర్చించి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్లబండి శశిధర్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి అత్తిని శారద, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఇప్పకాయల శోభ మరియు బాధిత కార్మికులు పాల్గొన్నారు.
– | హిందుస్థాన్ మీడియా |
సామాన్యుడి నేస్తం 📰