🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 10 Sep, 2026 | Page: 1

ఐలమ్మ సాహసం ధైర్యం నేటి ఉద్యమాలకు స్ఫూర్తి:సీపీఎం

సిద్దిపేట జిల్లా, మద్దూరు, సెప్టెంబర్ 10, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని సీపీఎం మద్దూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఆలేటి యాదగిరి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. దొరల పెత్తనాన్ని ధైర్యంగా ఎదిరించిన ఐలమ్మ సాహసం, పోరాట పటిమ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు. ఆమె స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఎం.డి. షఫీ, మండల కమిటీ సభ్యులు వేల్పుల విజయ్, సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల నరేష్, రజక వృత్తిదారుల సంఘం నాయకులు పిడిసెట్టి రాజు, మల్లేశం, సాయిలు, నాయకులు ఇష్టమైన మల్లేశం, చందు, శోభన్ కృష్ణ, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home