మద్దూరు ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం
ప్రతి ఏటా ఉపాధ్యాయులను సన్మానిస్తా: సర్పంచ్ దామెర మల్లేశం
విద్యతో పాటు ఏదో ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవాలి: ప్రిన్సిపల్ నరేందర్ రెడ్డి
సిద్దిపేట జిల్లా, మద్దూరు, సెప్టెంబర్ 9, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దామెర మల్లేశం మాట్లాడుతూ ఉపాధ్యాయులను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గతంలో తాను ఎంతోమంది విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చానని, ప్రస్తుతం వారిలో కొందరు వార్డు సభ్యులుగా, ఉపాధ్యాయులుగా సమాజానికి సేవలందించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను ఎల్లప్పుడూ గౌరవించాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానిస్తానని ఆయన తెలిపారు.
మండల విద్యాధికారి వరదరాజులు మాట్లాడుతూ సర్పంచ్ ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులను గౌరవించడం ద్వారా సమాజానికి మంచి సందేశం అందుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రిన్సిపల్ కోట నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలని సూచించారు. విద్యతో పాటు ప్రతి విద్యార్థి ఏదో ఒక నైపుణ్యాన్ని (స్కిల్) నేర్చుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ షకీల్ అహ్మద్, గ్రామ విద్యా కమిటీ సభ్యులు రేష్మ, గౌరీష్, హైమద్, అబూ షరీఫ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.