🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 09 Sep, 2026 | Page: 1

కాళోజి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలి

భాష, సాహిత్యం, సంస్కృతిని కాపాడుకోవాలి
కాళోజీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం: హెచ్‌ఎం
కొండపాక, సెప్టెంబర్‌ 9, హిందుస్థాన్‌ మీడియా:
తెలంగాణ ప్రజాకవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను కొండపాక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాలురలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల్లో తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి పట్ల ఆసక్తిని పెంపొందించేలా కాళోజీ జీవిత చరిత్రపై ఉపన్యాసాలు, వ్యాసరచన, చిత్రలేఖనం తదితర పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు కాళోజీ జీవితం, సాహిత్య ప్రస్థానం, సామాజిక స్పృహ, తెలంగాణ భాషపై ఆయనకున్న అభిమానం, ప్రజా సమస్యలపై చేసిన పోరాటం తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ కాళోజీ ఆశయాలు, ఆలోచనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. కాళోజీ చూపిన మార్గంలో నడుస్తూ తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. కాళోజీ రచనలను చదివి, వాటిలోని సామాజిక సందేశాన్ని అర్థం చేసుకుని జీవితంలో ఆచరించాలని కోరారు. భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధికి విద్యార్థులు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home