🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 09 Sep, 2026 | Page: 1

పెండింగ్ గ్రామపంచాయతీ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: స్వామి గౌడ్

కొమురవెల్లి, సెప్టెంబర్‌ 9, హిందుస్థాన్‌ మీడియా:
గతంలో గ్రామపంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న రసూలాబాద్‌ గ్రామ మాజీ సర్పంచ్‌ పచ్చిమడ్ల స్వామిగౌడ్‌ను కొమురవెల్లి పోలీసులు బుధవారం ముందస్తుగా అరెస్ట్‌ చేశారు.
ఈ సందర్భంగా స్వామిగౌడ్‌ మాట్లాడుతూ ముందస్తు అరెస్టులకు తాము భయపడేది లేదని అన్నారు. పెండింగ్‌లో ఉన్న గ్రామపంచాయతీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆయన పలు విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పాలన సాగించాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.
కార్యక్రమంలో కొమురవెల్లి సర్పంచ్‌ గొల్లపల్లి పద్మ ఆంజనేయులు, మాజీ ఉపసర్పంచ్‌ శ్రీధర్‌, మానుపాడు మహిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home