🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 05 Sep, 2026 | Page: 1

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 99 మందికి రూ. 3.45 లక్షల జరిమానా!

లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపిన మరో 75 మందికి రూ.2,31,000 ఫైన్‌
కొండపాక, సెప్టెంబర్‌ 5, హిందుస్థాన్‌ మీడియా:
వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 99 మందికి రూ.3,45,500 జరిమానా విధించినట్లు సిద్దిపేట ట్రాఫిక్‌ సీఐ చెట్టుక్రింది ముత్యం రాజు తెలిపారు. గత కొన్ని రోజులుగా ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వీరు పట్టుబడినట్లు చెప్పారు.
పట్టుబడిన 99 మందిని సిద్దిపేట స్పెషల్‌ సెకండ్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కాంతారావు ఎదుట హాజరుపరచగా విచారణ అనంతరం జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపిన 75 మందికి రూ.2,31,000 జరిమానా విధించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఐ ముత్యం రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల సొంత ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని కోరారు.
🏠 Home