🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 05 Sep, 2026 | Page: 1

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం :సర్పంచ్ దామెర మల్లేశం

10వ తరగతి ఉత్తీర్ణులకు సర్పంచ్ నగదు ప్రోత్సాహకం
మద్దూరు, సెప్టెంబర్‌ 5, హిందుస్థాన్‌ మీడియా:
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మద్దూరు గ్రామ సర్పంచ్‌ దామెర మల్లేశం అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మద్దూరు ZPHSలో ప్రధానోపాధ్యాయులు సర్వర్‌ మొహియుద్దీన్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి మండల విద్యాధికారి జి. వరదరాజులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్‌ మల్లేశం ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాల, మండల విద్యా వనరుల కేంద్రం, ప్రీ-ప్రైమరీ పాఠశాల, భవిత కేంద్రం ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. 2026లో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తన సొంత నిధులతో నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ప్రథమ స్థానం సాధించిన సుహానాకు రూ.10 వేలు, ద్వితీయ స్థానం సాధించిన అస్మాకు రూ.5 వేలు, ఎండీ ఆతీఫ్‌కు రూ.5 వేలు అందించారు.
ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు ఎంతో విలువైనవని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలోనూ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఇదే విధంగా ప్రోత్సాహకాలు అందిస్తానని ప్రకటించారు. అలాగే పాఠశాల విద్యార్థులందరికీ పాఠశాల పేరుతో టీషర్ట్లు, ట్రాక్‌ ప్యాంట్లు ఉచితంగా అందిస్తానని తెలిపారు.
కార్యక్రమంలో ఏఏపీసీ చైర్మన్‌ బూరుగు హేమలత, ప్రధానోపాధ్యాయులు రామేశ్వర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ ఎండీ షకీల్‌, మాజీ ఎంపీటీసీ బూరుగు నరసింహులు, హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బోయిని మనోహర్‌, విద్యా కమిటీ డైరెక్టర్‌ శ్రీకాంత్‌, అభి షరీఫ్‌, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
🏠 Home