విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
సామాజిక విలువలు, క్రమశిక్షణను బోధించాలి
విద్యార్థులకు ఉపాధ్యాయులే రోల్ మోడల్స్
37 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
రాజన్న సిరిసిల్ల జిల్లా, హిందుస్థాన్ మీడియా: విద్యార్థులను విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 37 మంది ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు.
తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులదే కీలక పాత్ర
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం మిగతా ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా, మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల వ్యక్తిత్వంపై అత్యంత ప్రభావం చూపేది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల బోధనలు, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయని, ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. విద్యార్థుల మనోవికాసంతో పాటు సామాజిక విలువలు, సమాజం పట్ల బాధ్యత, కట్టుబాట్లు, క్రమశిక్షణ వంటి అంశాలను బోధించాలని సూచించారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచుతూ విద్య, క్రీడలు, సాంస్కృతిక, సాంకేతిక తదితర అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని అన్నారు.
విద్యార్థులకు అందించే డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలను పెంచామని తెలిపారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని, ఉదయం పూట టిఫిన్ అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే 11 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఇప్పటికే ప్రారంభించామని, జిల్లాలో మరో రెండు పాఠశాలలు రానున్నాయని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.
విద్యార్థులకు టీచర్లే రోల్ మోడల్స్
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయులే రోల్ మోడల్స్ అని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన విద్యార్థి దశలోని జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆరో తరగతిలో పద్యం, ప్రసంగం చెప్పిన సందర్భం తనకు ఇప్పటికీ గుర్తుందని తెలిపారు. అప్పట్లో మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా కలెక్టర్‌ను కలవడం, ఆమె మాటలతో స్ఫూర్తి పొందడం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు.
ప్రతి ఏడాది ఉపాధ్యాయ దినోత్సవం వచ్చినప్పుడు ఆ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని తెలిపారు. ఎన్నికల సమయంలో జిల్లాలో ఉపాధ్యాయులు ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించారని అభినందించారు. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI), పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తదితర అంశాల్లో జిల్లాలో ఉపాధ్యాయులు మెరుగైన సేవలు అందించారని గుర్తుచేశారు. జిల్లాలో అమలు చేసిన PGI ప్రక్రియను పరిశీలించేందుకు ఖమ్మం జిల్లా నుంచి ఉపాధ్యాయులు వచ్చారని తెలిపారు.
ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థి తాను ఇష్టపడే ఉపాధ్యాయుడు బోధించే సబ్జెక్టును కూడా ఇష్టపడే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడి ప్రవర్తన విద్యార్థులపై ప్రభావం చూపుతుందని, అందువల్ల ఉపాధ్యాయులు తమను తాము ఆదర్శంగా నిలుపుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఎందరో ఉన్నత స్థానాలకు ఎదిగారని తెలిపారు.
37 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన హెచ్ఎంలు, పీడీలు, పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, కేజీబీవీ ఎస్వోలు, సీఆర్టీలు, పీజీ సీఆర్టీలు, ఐఈఆర్పీలను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి అవార్డులు అందజేశారు.
అవార్డులు అందుకున్న వారిలో చిట్నేని శ్రీకాంత్‌రావు, టీ. మనోహరాచారి, ఆడెపు రాజేశం, అజ్మీరా మదన్‌లాల్, గుర్రం సందీప్, నర్ర శ్రీనివాసరెడ్డి, టీ. మధుకర్‌రెడ్డి, గంప లక్ష్మీనారాయణ, ఎం. లక్ష్మయ్య, మహమ్మద్ రహీం, సీహెచ్. రమాదేవి, ఎం. కోటేశ్వర్, కొప్పు రాములు, వెంగల మహేష్, మాదాడి వెంకటరావు, కుమ్మరి మల్లేశం, సీహెచ్. మాధవీలత, ఎన్. కనకయ్య, ఈ. శ్రీనివాస్, కపిల్ల నరేష్, రామగిరి స్వరాజ్యలక్ష్మి, కొత్తపల్లి మమత, యాస శ్రీలత, డీ. రఘు, ఎం. సుజాత, బోనగిరి రాజేందర్, ఊతం విజయకుమార్, దరిపెల్లి రాజేశం, బొల్లి రమేష్, అణువోజు రాజు, తెల్ల వకుల, మేకల పద్మ, మామిళ్ల విఠల్, కే. జయలక్ష్మి, ఆర్. వసంత, బి. సుధారాణి, టీ. గీత ఉన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, జిల్లా విద్యాధికారి మొండయ్య, కోనరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్యతో పాటు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.