🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 04 Sep, 2026 | Page: 1

కుకునూర్‌పల్లి లో కారు- లారీ ఢీ.. లద్నూర్ కి చెందిన నలుగురికి గాయాలు

కొండపాక, సెప్టెంబర్ 4, హిందుస్థాన్ మీడియా: కుకునూర్‌పల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి లారీ–కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దూరు మండలం లద్దునూర్ గ్రామానికి చెందిన యాదగిరి (50), సింధు (40), హారిక (18), సాయి చరణ్ (22) ఒకే కుటుంబానికి చెందినవారు. వీరు కారులో లద్దునూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా కుకునూర్‌పల్లి గ్రామానికి చేరుకున్నారు.
అదే సమయంలో హైదరాబాద్ వైపు నుంచి వచ్చిన టిప్పర్ లారీ కుకునూర్‌పల్లి గ్రామంలోకి ప్రవేశించి తిరిగి గజ్వేల్ వైపు వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటుండగా, వెనుక నుంచి వచ్చిన కారు లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న కొండపాక 108 అంబులెన్స్ సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ మహేందర్, పైలట్ శ్రీనివాస్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లోకి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వారిలో సింధుకు తలకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. మిగిలిన ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🏠 Home