🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 04 Sep, 2026 | Page: 1

లద్నూరు లో బెల్ట్ షాప్ పై పోలీసుల దాడి, మద్యం స్వాధీనం

అనుమతి లేకుండా బెల్ట్‌షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఎస్‌ఐ మహమ్మద్ ఆసిఫ్
మద్దూరు, సెప్టెంబర్ 4, హిందుస్థాన్ మీడియా: ప్రభుత్వ అనుమతి లేకుండా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న బెల్ట్‌షాపుపై మద్దూరు పోలీసులు దాడి నిర్వహించారు. మద్దూరు మండలం లద్నూరు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో గురువారం రాత్రి ఎస్‌ఐ మహమ్మద్ ఆసిఫ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
బ్లూకోట్‌ పోలీసు సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ దాడుల్లో బెల్ట్‌షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన **13.8835 లీటర్ల వివిధ రకాల మద్యం, బీరు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మహమ్మద్ ఆసిఫ్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ.9,706 ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న నిర్వాహకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ మహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా బెల్ట్‌షాపులు నిర్వహించడం, మద్యాన్ని అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home