🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 04 Sep, 2026 | Page: 1

నిరుపేద కుటుంబానికి రెండు లక్షల ఎల్ఓసి అందజేత

వెంటనే స్పందించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్‌కుమార్ గౌడ్
బాధిత కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి
దూల్మిట్ట, సెప్టెంబర్ 4, హిందుస్థాన్ మీడియా: అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచారు. దూల్మిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన గుండారపు సిద్ధమ్మ గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్నారు. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో చికిత్స ఖర్చులు భరించడం కష్టంగా మారిన విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు నాగపురి కిరణ్‌కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు.
విషయం తెలుసుకున్న నాగపురి కిరణ్‌కుమార్ గౌడ్ వెంటనే స్పందించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్‌కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి, ఎంపీ వెంటనే స్పందించి బాధితురాలి వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల విలువైన ఎల్‌ఓసీ (Letter of Credit) మంజూరు చేయించారు.
మంజూరైన ఎల్‌ఓసీ పత్రాన్ని నాగపురి కిరణ్‌కుమార్ గౌడ్ బాధితురాలి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో సిద్ధమ్మకు అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న తమ కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, నాగపురి కిరణ్‌కుమార్ గౌడ్‌లకు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
🏠 Home