🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 25 Aug, 2026 | Page: 1

తెజోవనం ఆక్సిజన్ పార్కులో ఘనంగా వనమహోత్సవం

మొక్కలు నాటిన అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి
సిద్దిపేట జిల్లా, హిందుస్థాన్ మీడియా, కొండపాక: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కొండపాక మండలంలోని రాంపల్లి గ్రామ శివారులో ఉన్న తెజోవనం ఆక్సిజన్ పార్క్ పరిసరాల్లో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీఎఫ్‌ఓ పద్మజారాణి, ఎఫ్‌ఆర్‌ఓ సుజాత, డీవైఆర్‌ఓ పద్మ, ఎఫ్‌బీఓ రవికిరణ్తో పాటు అటవీ శాఖ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. రాంపల్లి గ్రామ సర్పంచ్ బొమ్మ మల్లయ్య, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, మార్పడగ గ్రామ సర్పంచ్ ఆకారం బాలరాజ్ కూడా కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడే వన మహోత్సవం లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు.
పచ్చదనం పెంపొందించడం, పర్యావరణాన్ని కాపాడటం, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని వారు పిలుపునిచ్చారు.
🏠 Home