🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 24 Aug, 2026 | Page: 1

అర్హులైన గీత కార్మికులు పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవాలి: ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్

11 మంది గీత కార్మికులకు ఐడీ కార్డులు పంపిణీ
రాజన్న సిరిసిల్ల జిల్లా, హిందుస్థాన్ మీడియా: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని 11 మంది గీత కార్మికులకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ సీఐ ఎం. శ్రీనివాస్ సోమవారం గీత కార్మిక ఐడీ కార్డులను పంపిణీ చేశారు. పెన్షన్‌కు అర్హత కలిగిన గీత కార్మికులు ఐడీ కార్డులను కలిగి ఉంటే సంబంధిత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ 50 సంవత్సరాలు నిండిన, అర్హత కలిగిన గీత కార్మికులు ఐడీ కార్డులు పొందిన అనంతరం పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన ప్రతి గీత కార్మికుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను అర్హులైన కార్మికులు పొందేలా అవగాహన కల్పించాలని గీత కార్మిక సంఘం ప్రతినిధులను కోరారు.
కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్‌ఐ బత్తిని ప్రణీత్ గౌడ్, ఇల్లంతకుంట గౌడ సంఘం అధ్యక్షుడు కొయ్యడ రాజయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు అంతటి రమేష్ గౌడ్, కోశాధికారి ముంజ భాస్కర్, సారా రమేష్, కొయ్యడ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
🏠 Home