దళిత జర్నలిస్టుల ఫోరం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా కర్రోళ్ల నవజీవన్
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: కర్రోళ్ల నవజీవన్
చేర్యాల, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట జిల్లా దళిత జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడిగా కర్రోళ్ల నవజీవన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు జర్నలిస్టులు, దళిత జర్నలిస్టుల ఫోరం సభ్యులు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కర్రోళ్ల నవజీవన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి సిద్దిపేట జిల్లా దళిత జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కాశపోగు జాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. డేవిడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ జిల్లాలోని దళిత జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. జర్నలిస్టులకు ఎలాంటి సమస్య ఎదురైనా వారి వెంట ఉండి, సమస్య పరిష్కారం అయ్యే వరకు ముందుండి పోరాడుతానని పేర్కొన్నారు.
దళిత జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని, సిద్దిపేట జిల్లాలో దళిత జర్నలిస్టుల ఫోరంను మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తానని నవజీవన్ తెలిపారు.
తనపై ఫోరం నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని కర్రోళ్ల నవజీవన్ స్పష్టం చేశారు.