🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 23 Aug, 2026 | Page: 1

నిరుపేద కుటుంబానికి పుస్తె మట్టెలు అందజేత

మానవత్వం చాటిన వాస్విక్ ఫౌండేషన్
నూతన వధువుకు పుస్తె మట్టెలు అందించిన నిడిగొండ నరేష్
హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 23: మద్దూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన జీడికంటి మల్లేశం కుమార్తె శ్రవంతి వివాహం సందర్భంగా వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద కుటుంబానికి అండగా నిలిచారు. గ్రామస్తుల ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్, వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి స్పందించి నూతన వధువుకు పుస్తె మట్టెలను అందజేశారు.
గ్రామ సర్పంచ్ జక్కుల కనకమ్మ లింగయ్య ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో నూతన వధువుకు తల్లిదండ్రుల సమక్షంలో పుస్తె మట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ మాట్లాడుతూ నూతన వధూవరుల దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు తమ వంతు సహాయం అందించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
పుస్తె మట్టెలు అందజేసినందుకు వధువు కుటుంబ సభ్యులు వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్, వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఊట్ల రవీందర్ రెడ్డి, వూట్ల నర్సిరెడ్డి, నాగిళ్ల చంద్రశేఖర్, నాగిళ్ల ప్రభాకర్, మారెళ్ల లక్ష్మారెడ్డి, వూట్ల కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home