ప్రభుత్వ కార్యాలయాలకు ఐదు గడియారాల వితరణ
రిచ్ చిల్డ్రన్, మంజునాథ్ హాస్పిటళ్ల సేవాభావం
హిందుస్థాన్ మీడియా, దూల్మిట్ట, ఆగస్టు 20: దూల్మిట్ట గ్రామ సర్పంచ్ గురుకుల లీలా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రిచ్ చిల్డ్రన్ హాస్పిటల్, మంజునాథ్ హాస్పిటల్ యాజమాన్యాలు గ్రామంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు ఐదు గడియారాలను ఉచితంగా అందజేశారు. గ్రామ ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ గడియారాలను అందించినట్లు హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు. ఎమ్మార్వో కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, గ్రామపంచాయతీ కార్యాలయం, రైతు వేదిక, జెడ్పీహెచ్‌ఎస్ దూల్మిట్ట పాఠశాలకు ఒక్కొక్క గడియారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవలు అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. గ్రామ అవసరాలను గుర్తించి ఉచితంగా గడియారాలను అందించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రైతు వేదిక, పాఠశాలకు గడియారాలు అందించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసి హాస్పిటల్ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సిద్దేశ్వర్, వార్డు సభ్యులు లత, తిరుపతి, నాగేష్, గ్రామ సభ్యులు సుద్దాల నర్సింలు, నాచగోని గణేష్ గౌడ్, కోల సత్తయ్య గౌడ్, బాల్ని రవి, నాచగోని రితేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.