🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 19 Aug, 2026 | Page: 1

చేర్యాలలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

జెండా ఆవిష్కరణ.. ఫొటోగ్రాఫర్ల బైక్ ర్యాలీ
హిందుస్థాన్ మీడియా, చేర్యాల: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేర్యాల మండల ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ మండల అధ్యక్షులు లింగంపల్లి బాబు జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు బైక్ ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు వల్లూరు విజయకుమార్, కార్యదర్శి మెడబోయిన లింగం, సహాయక కార్యదర్శి మాదాసు నరసింగరావు, కార్యవర్గ సభ్యులు తాటికొండ సుభాచారి, కుంటి ఉదయ్ కుమార్, యాట మహేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు హిందుస్థాన్ మీడియా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. 📸
🏠 Home