జాలపల్లి లో బోనాల జాతరకు ముమ్మర ఏర్పాట్లు : సర్పంచ్ కమలాకర్
అమ్మవారి ఆలయాల వద్ద ముందస్తు ఏర్పాట్లు
హిందుస్థాన్ మీడియా, దూల్మిట్ట, ఆగస్టు 19: దూల్మిట్ట మండలం జాలపల్లి గ్రామంలో ఈ నెల 23న పోచమ్మ, ఎల్లమ్మ బోనాల జాతర నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని గ్రామ సర్పంచ్ చెట్కూరి కమలాకర్ యాదవ్ తెలిపారు.
బోనాల జాతరను పురస్కరించుకుని గ్రామంలో విద్యుత్ దీపాల ఏర్పాటు, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, ఆలయ ప్రాంగణం పరిశుభ్రత తదితర పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు పరిసరాలను శుభ్రం చేస్తున్నామని పేర్కొన్నారు.
జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా మహిళలు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
బోనాల పండుగను ప్రశాంతమైన వాతావరణంలో వైభవంగా నిర్వహించేందుకు అధికారులు, గ్రామ పెద్దలు, జాతర నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని సర్పంచ్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పరశురాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.