🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 19 Aug, 2026 | Page: 1

మద్దూర్ లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

ఫొటోగ్రాఫర్లకు ఐడీ కార్డుల పంపిణీ
హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 19: మద్దూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా ఆవరణలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రఫీ అండ్ వీడియో గ్రాఫర్స్ తెలంగాణ అసోసియేషన్ జెండాను మద్దూరు మండల ఫొటోగ్రాఫర్ల ఉపాధ్యక్షుడు దాసు మహేందర్ ఆవిష్కరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తహసీల్దార్ రహీం, ఫొటోగ్రఫీ సృష్టికర్త జోసెఫ్ లూయిస్ డాగ్యూర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఫొటోగ్రాఫర్లకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు.
ఫొటోగ్రఫీ రంగంలో సేవలందిస్తున్న ఫొటోగ్రాఫర్ల కృషిని పలువురు అభినందించారు. ఒక క్షణాన్ని చిత్రంగా బంధించి, ఆ దృశ్యాన్ని భవిష్యత్ తరాలకు సాక్ష్యంగా నిలిపే ఫొటోగ్రాఫర్ల సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామ్మోహన్, ఎస్‌ఐ అసిఫ్, ఏపీఓ మంజుల రెడ్డి, ఎంపీవో గద్దల వెంకటేశ్వర్లు, సర్పంచులు కనక చంద్రం, నీరటి శ్రీనివాస్, ఉపసర్పంచ్ షకీల్ అహ్మద్, సీపీఎం సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు ఆలేటి యాదగిరి, నాయకులు సౌకత్ అలీ, తాజ్ మహల్, మధుసూదన్ రెడ్డి, మనోహర్, సిద్దిక్, జిలాని, శెట్టి రాజు, సుంకోజు శ్రీశైలం, నీరటి కిరణ్ కుమార్, సతీష్, మిందే మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.అలాగే మద్దూరు మండల ఫొటోగ్రాఫర్ల గౌరవ అధ్యక్షుడు కొరిగింజ బాలేషా, బూరుగు శంకర్, గొట్టే పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల శ్రీకాంత్, కోశాధికారి జగ్గని దయాకర్, కొరిగింజ శేఖర్, తాళ్లపల్లి షాదుల్లా, పాకాల కిరణ్ కుమార్, కొండ రోహిత్, బంటు కార్తీక్ తదితర ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు.
🏠 Home