🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 19 Aug, 2026 | Page: 1

మర్రిముచ్చాలలో ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు
హిందుస్థాన్ మీడియా: మర్రిముచ్చాల గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిలుకవాగు గౌడ సంఘం, మర్రిముచ్చాల గౌడ సంఘం సభ్యులు పాల్గొని పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సభ్యులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గౌడ సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
🏠 Home