🏠 hindusthanmedia.com
Watermark
Newspaper Logo
hindusthanmedia.com | Date: 18 Aug, 2026 | Page: 1

ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: DYFI దాసరి ప్రశాంత్ డిమాండ్

ఆగస్టు 20న కలెక్టరేట్ ఎదుట ధర్నా: డీవైఎఫ్‌ఐ
నిరుద్యోగుల సమస్యలపై ఉద్యమానికి పిలుపు
హిందుస్థాన్ మీడియా, చేర్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు డీవైఎఫ్‌ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ తెలిపారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
దేశంలో, రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ తగిన ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారని ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కూడా ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసి నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
అలాగే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగ యువత ఆశలను ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు.ఆగస్టు 20న నిర్వహించే జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని దాసరి ప్రశాంత్ కోరారు.
ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకులు స్వర్గం శ్రీకాంత్, తాడూరి ప్రవీణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home