యువత ఉచిత డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: యోగేశ్వర్ జాదవ్
కేవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డ్రైవింగ్ స్కూల్ ప్రారంభం
18 ఏళ్లు నిండిన యువతకు శిక్షణతో పాటు డ్రైవింగ్ లైసెన్స్
హిందుస్థాన్ మీడియా, సిద్దిపేట, ఆగస్టు 17: 18 సంవత్సరాలు నిండిన యువత ఉచిత డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి యోగేశ్వర్ జాదవ్ సూచించారు. సిద్దిపేట పట్టణంలో కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ వంశీధర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా యోగేశ్వర్ జాదవ్ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేలా ఉచిత డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. యువత శిక్షణను సద్వినియోగం చేసుకుని నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.
కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ వంశీధర్ రావు మాట్లాడుతూ గతంలో నంగునూరు, చిన్నకోడూరు మండలాల్లో ఉచిత డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిద్దిపేట పట్టణంలో ఇది మూడో ఉచిత డ్రైవింగ్ శిక్షణ కేంద్రంగా ప్రారంభించామని చెప్పారు.
18 ఏళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు గల యువతకు ప్రాధాన్యత ఇస్తూ డ్రైవింగ్ శిక్షణ అందించడంతో పాటు, లైసెన్స్ పొందేందుకు సహకరిస్తామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు చట్టపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ తీసుకున్న తర్వాతే వాహనాలు నడపాలని సూచించారు.
యువతకు ఉపయోగపడే ఇలాంటి ఉచిత శిక్షణ కార్యక్రమాలను భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని వంశీధర్ రావు తెలిపారు.
కార్యక్రమంలో కేవీఆర్ ఫౌండేషన్ సభ్యులు, యువత, పలువురు పాల్గొన్నారు.