బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే ; జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
21 ఫిర్యాదులు స్వీకరణ
రాజన్న సిరిసిల్ల జిల్లా, హిందుస్థాన్ మీడియా: ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 21 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులపై చట్టపరంగా విచారణ చేపట్టి బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, ప్రజా సమస్యలను పరిష్కరించేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
అవసరమైన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తద్వారా ప్రజల్లో పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
గ్రీవెన్స్ డేలో స్వీకరించిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా సమస్యలకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.