హయత్‌నగర్ మంజీరా కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
హైదరాబాద్: హయత్‌నగర్‌లోని మంజీరా కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్, జీఎస్ సేవా సమితి అధ్యక్షులు గ్యారాల శ్రీనివాస్ గౌడ్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అనంతరం కాలనీ వాసులు, సేవా సమితి సభ్యులు, స్థానికులు కలిసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు, యువత, జీఎస్ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు, యువత, జీఎస్ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.