పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
సిరిసిల్లలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం
హిందుస్థాన్ మీడియా, రాజన్న సిరిసిల్ల జిల్లా: పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు ఫంక్షన్ హాల్లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.
జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రతి మండలానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
జిల్లాలో 1,95,915 స్మార్ట్ రేషన్ కార్డులు
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో 24,174 నూతన రేషన్ కార్డులు మంజూరు కాగా, మొత్తం 1,95,915 స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు కేవలం గుర్తింపు పత్రం మాత్రమే కాదని, పేదలకు గౌరవంతో పాటు ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలను పొందేందుకు ఉపయోగపడే ముఖ్యమైన పత్రమని పేర్కొన్నారు.
పట్టణాలు, గ్రామాల వారీగా రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులు కార్డులను పంపిణీ చేస్తారని తెలిపారు. పేదలకు సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్న ఆయన, జిల్లాలో ప్రతి నెలా సుమారు 3,700 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
పేదలు, రైతులు, మహిళల సంక్షేమానికి ప్రాధాన్యంముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు, నేతన్నలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని ఆది శ్రీనివాస్ తెలిపారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
సిరిసిల్లలో చేనేత, వస్త్ర పరిశ్రమ అభివృద్ధితో నేతన్నలకు ఉపాధి కల్పించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
అర్హులందరికీ సన్నబియ్యం
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,95,915 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి మండలానికి ఐదు చొప్పున కార్డులు అందజేస్తున్నామని, సోమవారం నుంచి అన్ని మండలాల్లో పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.స్మార్ట్ రేషన్ కార్డుతో టీ-రేషన్ యాప్ ద్వారా రేషన్ సరుకులు, రేషన్ దుకాణాలు, నిల్వలు తదితర వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్మన్లు జిందం కళ, పుల్కం రాజు, ఆత్మ కమిటీ డివిజన్ చైర్మన్ ముకుంద రెడ్డి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కే.ఎస్.బీ. కుమారి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, ఆయా మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.